సిలిగురిలో హిందూ జాగరణ మంచ్ పోస్టర్ల కలకలం: వివాదంలో షాపింగ్ పిలుపు

రిపోర్టర్: హరి స్థలం: Siliguri

పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో హిందూ జాగరణ మంచ్ ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. హిందూ దుకాణాల నుంచే బిర్యానీ, పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని ఆ సంస్థ పోస్టర్లు వేసింది. ఇది ఎలాంటి హుకుం కాదని, కేవలం స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేసిన విజ్ఞప్తి మాత్రమేనని ఆ సంస్థ సభ్యుడు అభిషేక్ దాస్ వెల్లడించారు. ఈ మతపరమైన ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీపీఎం నేత అశోక్ భట్టాచార్య మండిపడ్డారు.