ఆర్థిక సంక్షోభంలో ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు: దివాలా కోసం ఎన్ఎఫ్ఎల్ స్టార్ రాషీ రైస్ దరఖాస్తు

రిపోర్టర్: సురేష్ స్థలం: Dallas

అమెరికన్ ఫుట్బాల్ లీగ్ స్టార్ రాషీ రైస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాలా కోసం ఫెడరల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు ఎస్పీఎన్ రిపోర్టర్లు నేట్ టేలర్, మై రోత్స్టెయిన్ వెల్లడించారు. తన వద్ద కేవలం ఆరు లక్షల డాలర్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని, కానీ మూడున్నర మిలియన్ డాలర్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 2024 లో జరిగిన రోడ్డు ప్రమాదం, ఇతర చట్టపరమైన వివాదాల కారణంగా భారీగా నష్టపోయినట్లు తెలిపారు.