అల్లూరి జిల్లా ఆశ్రమ పాఠశాలలో గణపతి పూజలో ప్రత్యక్షమైన ఎలుక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సీలేరు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వినాయక చవితి వేడుకల సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. గణపతి పూజ నిర్వహిస్తుండగా వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చిన ఎలుక, భయపడకుండా స్వామివారి పాదాల వద్ద ప్రశాంతంగా కూర్చుని నైవేద్యాన్ని తిన్నది. స్వామివారి వాహనమైన మూషికమే స్వయంగా వచ్చి దర్శనమిచ్చిందని గిరిజన బాలికలు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేయగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.