దారుణం: పత్తి చేనులో మహిళను కాటేసిన విషసర్పం, మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గోపాలదిన్నె గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లిన లలిత అలియాస్ మంజుల (33) అనే మహిళను పాము కాటేసినట్లు స్థానికులు తెలిపారు. పత్తి చేనులో పత్తి ఏరుతుండగా విషసర్పం కాటు వేయడంతో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.