టెస్టు క్రికెట్ కు మహమ్మద్ షమీ వీడ్కోలు: మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర నిరాశ

రిపోర్టర్: రాము స్థలం: వెల్లింగ్టన్

భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన అద్భుతమైన బౌలర్ ఇలా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. షమీలో ఇప్పటికీ కనీసం మరో ముప్ పై నుంచి నలభై వికెట్లు పడగొట్టే సత్తా ఉందని, సెలెక్టర్ల వైఖరి సరికాదని శాస్త్రి ఘాటుగా విమర్శించారు.