విద్యుదాఘాతంతో మృతిచెందిన కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బేబీనాయన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: తెర్లాం
విజయనగరం జిల్లా తెర్లాం మండలం అప్పలంపేట గ్రామానికి చెందిన కాబోతుల పోలిరాజు గొలుగువలసలో కూలిపనికి వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.