సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకోలేనంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర భావోద్వేగం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల ప్రజలను ఏనాటికీ మరువబోనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీగాధ గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని కొనియాడుతూ, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.