సౌదీ అబద్ధాలు చెబుతోంది: డొనాల్డ్ ట్రంప్‌ను నిలదీసిన 9/11 బాధితురాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: World
గ్రౌండ్ జీరో వద్ద అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 9/11 బాధితురాలైన టెర్రీ స్ట్రాడా తీవ్రంగా నిలదీశారు. సౌదీ అరేబియా ఉగ్రదాడిలో పాత్ర పోషించిందని, 25 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వాలు సౌదీలను కాపాడుకుంటూ వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీలు అబద్ధాలు చెప్పకుండా చూడాలని ట్రంప్‌ను డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాల రికార్డులను పరిశీలిస్తానని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు.