జీవో 59 దరఖాస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో ఐదు వందల గజాల లోపు జీవో 59 పెండింగ్ దరఖాస్తులను కేవలం నెల రోజుల్లో పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.