సూర్య సినిమా విడుదలకు మార్గం సుగమం: పిల్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన సూర్య సినిమా విడుదలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్ర విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చినట్లు న్యాయస్థానం వర్గాలు తెలిపాయి. వైద్యులపై హింసను ప్రేరేపిస్తోందంటూ డాక్టర్లు వేసిన పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఇదే అంశంపై మరో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున సమాంతర విచారణ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.