ఇరుముడి సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారన్న ప్రచారంపై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారంటూ సాగుతున్న ప్రచారంపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. రామ్ చరణ్ గారు మా సినిమాలో నటిస్తే అంతకంటే ఆనందం వేరొకటి ఉండదని, కానీ ఆయన్ను క్యామియో పాత్ర కోసం సంప్రదించాలనే ఆలోచన అసలు మాకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వదంతులకు తెరదించారు.