ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అధికారుల పెత్తనంపై మండిపడ్డ సర్పంచులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడత లబ్ధిదారుల ఎంపికపై రఘునాథపురం సర్పంచి పల్లె సంతోష్, బొందుగుల సర్పంచి పయ్యావుల ఎల్లయ్య అసహనం వ్యక్తం చేశారు. తమను దోషిగా నిలబెట్టి అధికారులే పెత్తనం చేస్తూ అవమానిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నాగవేణి, తహసీల్దార్ రవి కిరణ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.