మంచిర్యాల రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాలలో రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. పనుల సమయంలో ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలికంగా మట్టి రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్ తదితరులు పాల్గొన్నారు.