హిందూపురం మున్సిపల్ ఎన్నికలు: ఓటు హక్ కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

రిపోర్టర్: సునీల్ స్థలం: హిందూపురం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.