విజయవాడ బెంజిసర్కిల్ వద్ద కారు దగ్ధం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

విజయవాడ బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ పై టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరమ్మతుల అనంతరం మెకానిక్ సురేష్ కారును పరిశీలిస్తుండగా పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమై బయటకు దూకాడు. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.