న్యూయార్క్‌లో ఘనంగా వైభవంగా వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూయార్క్
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అసమయి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలువురు తెలుగు కుటుంబాలు, చిన్నారులు, ప్రముఖ వ్యాపారవేత్త డా. పైళ్ళ మల్లారెడ్డి దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.