రైతన్నలకు తీపి కబురు: రాష్ట్రంలో క్రాప్ హాలిడే లేదని తుమ్మల స్పష్టీకరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని ఆయన ఖచ్చితంగా వెల్లడించారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులకు నష్టం వాటిల్లకుండా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.