బ్రిక్స్ సదస్సులో ప్రపంచ శాంతికి ఐరాస పిలుపు
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ప్రపంచ శాంతి కోసం పిలుపునిచ్చారు. గాజా, ఉక్రెయిన్, సూడాన్ వంటి ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని, అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు గౌరవించాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిక్స్ దేశాలు గాజాలో కాల్పుల విరమణ పాటించాలని కోరాయి.