రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి దీపికా పడుకోన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: மும்பை

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణవీర్‌ సింగ్‌, దీపికా పడుకోన్‌ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. అగ్ర కథానాయిక దీపికా పడుకోన్‌ పండంటి రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ జంట అధికారికంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. 2024 సెప్టెంబర్‌ 8న తొలి బిడ్డ దువా జన్మించగా, సరిగ్గా రెండేండ్ల తరువాత మరో కుమార్తె జన్మించడం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.