పురపోరులో వైఎస్సార్సీపీకి భారీ షాక్: పలు చోట్ల నామినేషన్లు వేయని వైనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియగా, పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. గురజాలలో ఒక్క నామినేషన్ కూడా సమర్పించలేదని, గడువు ముగియడంతో పిడుగురాళ్లలో ఛైర్మన్ అభ్యర్థి షేక్ అబ్దుల్లా నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. పుంగనూరు, రాయచోటి, దర్శిలలోనూ వైఎస్సార్సీపీ తరఫున ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో పలు స్థానాలు చేజారే పరిస్థితి ఏర్పడింది.