రాప్తాడు దాడి బాధితురాలికి మెరుగైన వైద్యం: రానున్న నూట ఇరవై గంటలు అత్యంత కీలకం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రాణాలు కాపాడుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పద్దెనిమిది గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించామని, రానున్న నూట ఇరవై గంటలు అత్యంత కీలకమని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.