ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వెల్లడించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో ప్రస్తావించగా, ప్రతివాదుల తరఫు న్యాయవాదుల వాదనలు కూడా విన్న సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌ను బుధవారానికి వాయిదా వేసింది.