నేటి నుంచి దిల్లీలో జాతీయ సోషల్ మీడియా కార్యాలయం

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

భారతీయ జనతా పార్టీ జాతీయ సోషల్ మీడియా కార్యాలయం నూతన దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సోషల్ మీడియా ముఖ్య అధికారులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేస్తూ కీలక ప్రసంగం చేశారు.