పదోన్నతి పొందిన పోలీసు అధికారులను అభినందించిన సీపీ సునీల్ దత్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన 11 మంది పోలీసు అధికారులను సీపీ సునీల్ దత్ అభినందించారు. హెడ్ కానిస్టేబుళ్లుగా సేవలందించిన అధికారులకు పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు బదిలీపై వెళ్లనున్న అధికారులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సీపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాద్ పాల్గొన్నారు.