గుంటూరు జిల్లాలో దారుణం: చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి చిన్నారుల హత్య
రిపోర్టర్: విజయ్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లాలో ఆస్తి వివాదాల నేపథ్యంలో సవతి తల్లి అత్యంత క్రూరంగా వ్యవహరించింది. చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనపై కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి విచారణ చేపట్టి నిందితులు మేరీ, రాంబాబులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కలుషిత ఆహారం తిని పిల్లలు మృతి చెందారని మొదట నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించి ఈ దారుణాన్ని బట్టబయలు చేశారు.