ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణించి రెండేళ్లు పూర్తి: జర్నలిస్ట్ సెరీష్ నానిశెట్టి నివాళి

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

జీఎన్ సాయిబాబా కన్నుమూసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సెరీష్ నానిశెట్టి (Serish Nanisetti - The Hindu) కీలక విషయాలు గుర్తుచేసుకున్నారు. సాయిబాబా తన జీవితంలో మొత్తం 3,592 రోజులు జైలులో గడిపారని, జైలు వెలుపల కేవలం 219 రోజులు మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన రాసిన కవితా పుస్తకాన్ని సమీక్షించిన అనుభవాలను, ఆనాటి పోరాటాలను సెరీష్ నానిశెట్టి గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.