ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం.. జాన్సన్ నాయక్ ధ్వజమెత్తారు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి జాన్సన్ నాయక్ ఆరోపించారు. కేటీఆర్ పిలుపుమేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.