క్రిటికల్ మినరల్ జాబితాలోకి మంగంపేట ముగ్గురాయి నిల్వలున్నాయన్న అధికారులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుపతి జిల్లా

ఆసియాలోనే ప్రసిద్ధి గాంచిన తిరుపతి జిల్లా మంగంపేట ముగ్గురాయి నిల్వలు తరిగిపోతుండటంతో కేంద్రం దీన్ని క్రిటికల్ మినరల్ జాబితాలో చేర్చనుంది. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో మరో రెండేళ్లు మాత్రమే తవ్వకాలు సాగించే వీలున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఇటీవల దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. దేశీయ అవసరాలరీత్యా ఓఎన్‌జీసీ కోసం పెద్దఎత్తున నిల్వలను రిజర్వ్ చేయాలని నిర్ణయించారు. ఈ తరుణంలో ధరల ఖరారుపై ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖకు లేఖ రాసింది.