మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా సతీష్ బాబన్ వాఘోలే
రిపోర్టర్: రాము
స్థలం: Pune
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా సతీష్ బాబన్ వాఘోలే అదనపు బాధ్యతలు స్వీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీలు మరియు వివిధ అవకతవకలపై అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు నిర్వహించడంతో, ప్రస్తుత ఛైర్మన్ వివేక్ భీమాన్వార్ సెలవుపై వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.