భారీ ఊరట: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో రూ.366 కోట్ల రాబడి
రిపోర్టర్: మహేష్
స్థలం: విశాఖపట్నం
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ దిశగా కీలక అడుగులు పడ్డాయని అధికారులు తెలిపారు. నగరంలోని హెచ్బీ కాలనీలో ఎన్ఎల్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి విడత భూముల ఈ-వేలానికి విశేష స్పందన లభించిందని వారు పేర్కొన్నారు. ఈ వేలంలో గజం భూమి ధర అత్యధికంగా లక్షా ఎనభై వేల రూపాయలు పలికిందని, మొత్తం నూట యాభై ప్లాట్ల విక్రయం ద్వారా ఆర్ఐఎన్ఎల్కు మూడు వందల అరై ఆరు కోట్ల రూపాయల భారీ రాబడి సమకూరిందని అధికారులు స్పష్టం చేశారు.