'బ్యాక్ హోమ్..': ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరిన డిస్కో శాంతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
ప్రముఖ సీనియర్ నటి డిస్కో శాంతి అకస్మాత్తుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వందలాది చిత్రాల్లో తనదైన నృత్యాలతో అలరించిన ఆమె, తాజాగా ఆసుపత్రి గౌను ధరించి ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'బ్యాక్ హోమ్' అని పేర్కొన్నారు. అయితే ఆమెకు ఏమైందనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.