ఉడాన్ పథకంతో దేశంలో విమానయాన రంగం అద్భుత ప్రగతి సాధించింది

రిపోర్టర్: హరి స్థలం: India

ఉడాన్ పథకం ద్వారా భారతదేశంలో ప్రాంతీయ విమాన అనుసంధానం ఊహించని స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సాధారణ పౌరులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రారంభించిన ఈ పథకం గత పదేళ్లలో సాధించిన పురోగతి అద్భుతమని ఆయన పేర్కొన్నారు. చిన్న నగరాలకు విమాన సేవలు విస్తరించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు, పర్యాటకం బలోపేతం కావడంతో పాటు యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభించాయని ఆయన వివరించారు.