కుటుంబ సభ్యులతో కలిసి సల్మాన్ ఖాన్ గణేష్ నిమజ్జనం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మహారాష్ట్ర

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు. సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో సల్మాన్ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. గణపయ్యకు హారతి ఇచ్చి నిమజ్జనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.