అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే పదవికి రాజీనామా చేయాలని కౌన్సిలర్ సవాల్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి తీవ్రంగా ఖండించారు. తమపై చేసిన రూ.10 లక్షల అవినీతి ఆరోపణలను వెంటనే నిరూపించాలని, లేనిచో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయాలని ఆమె సవాల్ విసిరారు. ఆర్పీ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.