స్వరూప్ నగర్ బాలిక హత్య కేసుపై అదనపు డీసీపీ స్పష్టత
రిపోర్టర్: శివ
స్థలం: Delhi
దిల్లీలోని స్వరూప్ నగర్ మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి ఔటర్ నార్త్ దిల్లీ అదనపు డీసీపీ లోకేశ్వరణ్ మీడియాతో మాట్లాడారు. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహం లభించిందని, అది మగపిల్లవాడిదా లేక ఆడపిల్లవాడిదా అని కూడా నిర్ధారించలేనంత దారుణంగా శవం మారిపోయిందని ఆయన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.