కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం: వచ్చే జూన్ లోగా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం
రిపోర్టర్: మహేష్
స్థలం: కూసుమంచి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవర్గాలకు విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవనాన్ని మంగళవారం ఆయన కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది జూన్ లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. పేదలకు వైద్య భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.