భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గంధాలవీధి రహదారి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: చింతపల్లి
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పోస్టు గంధాలవీధి గ్రామానికి వెళ్లే రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. గ్రామస్థులు సుమారు రూ.5 లక్షల సొంత నిధులతో రౌరింతాడా నుంచి 2 కిలోమీటర్ల మేర రహదారి ఏర్పాటు చేసుకున్నారు. కల్వర్టు, రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు వెంటనే పరిశీలించి రహదారి, కల్వర్టును పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.