పులివెందులలో కూటమి విజయదుందుభి: వైఎస్సార్సీపీ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు

రిపోర్టర్: రాము స్థలం: Kadapa

నాడు ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైఎస్సార్సీపీకి నేడు పురపాలక ఎన్నికల్ లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. పులివెందుల నుంచి పుంగనూరు వరకు కూటమి విజయదుందుభి మోగించడంతో పాటు జగన్ సొంత కంచుకోటలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది అని పలువురు నేతలు తెలిపారు. నాడు కండబలంతో సాగిన అరాచకాలు నేడు ప్రజల స్వేచ్ఛా తీర్పు ముందు నిలవలేకపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు.