ఎండలతో పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు: తగు జాగ్రత్తలు తప్పవని వైద్యుల హెచ్చరిక
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తీవ్రమైన ఎండలు మరియు ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా గుండె మరియు రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని డాక్టర్ సురభి చతుర్వేది వెల్లడించారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తం చిక్కబడి రక్తనాళాల్లో గడ్డకట్టే ముప్పు ఉంటుందని ఆమె తెలిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు స్పష్టం చేశారు.