రష్యా చమురు కొనుగోళ్లపై భారత్కు మద్దతు తెలపాలని జేమీ డైమన్ సూచన

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: USA

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్లు విధించవద్దని అమెరికాను ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ కోరారు. తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే అది కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.