ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన దివ్య మిట్టల్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

రాజకీయ కక్షల కారణంగా ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన దివ్య మిట్టల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా నేరుగా ప్రజలతో కలసి పనిచేస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని, అక్కడి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. ప్రజా సేవకే తన మొదటి ప్రాధాన్యమని ఆమె వివరించారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.