పల్లెపండుగ మూడో విడతతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జాతర ప్రారంభమైందని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: గుంటూరు
పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని కసుకర్రు గ్రామంలో పల్లెపండుగ మూడో విడత కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధి జాతర ఘనంగా ప్రారంభమైందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.