లారెన్స్ బిష్ణోయ్ భార్యగా నటించి జాట్ నేతకు బెదిరింపులు

రిపోర్టర్: రాము స్థలం: ఉత్తర ప్రదేశ్

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భార్యనని నటిస్తూ జాట్ నేత ముకుల్ చౌదరికి సోషల్ మీడియా వేదికగా హత్య బెదిరింపులు జారీ చేసిన రాజస్థాన్‌కు చెందిన బిందు దేవిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా గాయకుడు అంకిత్ బాలియాన్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసినందుకు ఆమె ఈ బెదిరింపులకు పాల్పడినట్లు షామ్లీ ఎస్పీ ఎన్పీ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.