నెల్లూరు జిల్లాలో సంచలనం: జైలు నుంచి పోటీ చేసి జెడ్పీటీసీగా గెలుపు

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ ఎన్నికల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఘన విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైలులో ఉన్న ఆయన, ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. కుటుంబ సభ్యుల ప్రచారం, ఓటర్ల మద్దతుతో జైలు గోడల మధ్య నుంచే ఈ విజయం సాధించడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.