సినిమా అప్డేట్: ఇట్లు అర్జున ట్రైలర్ విడుదల తేదీ ఖరారు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ యంగ్ హీరో అనీష్, అందాల భామ అనస్వర జోడీగా మహేష్ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు అర్జున సినిమా ట్రైలర్ ను నవంబర్ నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు పలు సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించగా, నవంబర్ పదమూడో తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.