ఆధ్యాత్మిక సినిమా: ఈ నెల తొమ్మిదిన హనుమాన్ అంశ్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన భక్తిరసాత్మక చిత్రం హనుమాన్ అంశ్ ఈ నెల తొమ్మిదిన తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. విశ్వాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శోబినావ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు.