రామగిరి పాత బంగారు గనిలో నిధి కోసం వెళ్లి చిక్కుకున్న వ్యక్తి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా
యూట్యూబ్ వీడియోలను నమ్మి శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పాత బంగారు గనిలో నిధి కోసం దిగి చిక్కుకున్న ప్రభాకర్ రెడ్డిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. సులభంగా ధనవంతులు కావాలనే ఆశతో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి, కిష్టయ్య సోమవారం రాత్రి గనిలోకి వెళ్లగా చీకటి, గాలి సరిగా అందక ప్రమాదంలో చిక్కుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతడిని బయటకు తీసుకువచ్చారు.