భారత్ లో బ్రిటన్ వర్సిటీల క్యాంపస్ లతో నూతన విద్యావకాశాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యను అందించే దిశగా బ్రిటన్ విశ్వవిద్యాలయాలు దేశంలో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నాయని బ్రిటిష్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ ఇండియా డైరెక్టర్ రిత్తికా చందా పరుక్ తెలిపారు. సాధారణ విద్యా హబ్ లతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న డిగ్రీలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ విధానం భారత, బ్రిటన్ విద్యా వ్యవస్థల మధ్య వారధిలా పనిచేస్తుందని ఆమె వెల్లడించారు.