తెలంగాణలో అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ మొదటి వారం నుంచే అధికారికంగా ప్రారంభించనున్నట్లు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయించే రైతుల వద్ద విధిగా అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ ఉండాలని, నిర్దిష్ట రకాల ధాన్యానికి బోనస్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.