వైఎస్సార్సీపీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ నేత బొత్స
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
విజయనగరంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. తన ప్రధాన అనుచరుడు చిన్న శ్రీను పార్టీ వీడడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు.